![]() |
![]() |

ఆరేళ్ల క్రితం అథియా శెట్టి (సునీల్ శెట్టి కూతురు), సూరజ్ పంచోలి (ఆదిత్య పంచోలి కొడుకు) పరిచయ చిత్రం 'హీరో' ట్రైలర్ లాంచ్ వేడుక జరిగింది. అందులో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న సల్మాన్ ఖాన్.. సినిమాలో కిస్సింగ్ సీన్స్ అవసరం లేదనేది తన అభిప్రాయంగా చెప్పాడు. అలాగే ది హిందూకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో "వికారం" అనిపించడం వల్లే తానెప్పుడూ తెరపై ఏ హీరోయిన్‌నూ ముద్దు పెట్టుకోలేదని వెల్లడించాడు.
అయితే "నో కిస్ పాలసీ"కి సల్మాన్ ఖాన్ స్వస్తి చెప్పేశాడు. 55 సంవత్సరాల వయసులో, 23 ఏళ్ల సినీ కెరీర్‌లో తొలిసారి ముద్దు సన్నివేశంలో నటించాడు. సల్మాన్ లేటెస్ట్ ఫిల్మ్ 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' ట్రైలర్ ఈరోజు రిలీజైంది. ఇందులో హీరోయిన్ దిశా పటానీతో లిప్ లాక్ చేస్తూ కనిపించాడు సల్మాన్. ఏమరుపాటుగా ఉంటే ఆ సీన్‌ను మిస్సయిపోతారు. ఎందుకంటే ఈ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ మధ్యలో జస్ట్.. ఒక్క సెకను మాత్రమే ఆ లిప్ లాక్ సీన్ కనిపిస్తుంది మరి. అయితే ఆ టైమ్‌లో దిశ లిప్స్‌కు టేప్ అంటించి ఉండటం కొసమెరుపు.

ఏదేమైనా ఈ సీన్ చూసి ఫ్యాన్స్ షాకైపోయారు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దిశ పెదాలపై సల్మాన్ కిస్ ఇచ్చే సీన్ చూసి తాము షాకయ్యామని చాలా మంది ఫ్యాన్స్ ట్విట్టర్‌లో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ సీన్ తమకు నచ్చిందని చాలామంది ఫీలవుతున్నారు.

'రాధే'లో ఇంకో ఆసక్తికరమైన విషయమేమంటే అల్లు అర్జున్ మూవీ 'దువ్వాడ జగన్నాథమ్'లోని హిట్ సాంగ్ "సీటీమార్"ను ఈ సినిమాలో ఉపయోగించారు. దేవి శ్రీప్రసాద్ బాణీలను ఉపయోగించుకుంటూ హిందీలో లిరిక్స్‌ను రాయించారు. సీటీమార్ అనే పదాన్ని అలాగే ఉంచారు. ఈ సాంగ్‌ను సల్మాన్, దిశాలపై చిత్రీకరించారు. అలాగే జాక్వలిన్, సల్మాన్‌పై ఓ ఐటమ్ సాంగ్ కూడా 'రాధే'లో ఉంది. ఈ మూవీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ రాధేగా కనిపించనున్నాడు సల్మాన్.

ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని రంజాన్ పర్వదినం సందర్భంగా మే 13న రిలీజ్ చేయాలని సంకల్పించారు. అప్పటికి పరిస్థితులు సానుకూలంగా ఉంటే సినిమా విడుదలవుతుంది. లేదంటే.. విడుదల వాయిదాపడొచ్చు.

![]() |
![]() |